హరీష్ రావు ఓటు వేసేది ఇక్కడే...

06:44 - December 7, 2018

సిద్ధిపేట : ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 7వ తేదీ ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 1102 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 8 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించి...ఏర్పాట్లు తెలుసుకొనేందుకు టెన్‌టివి ప్రయత్నించింది. అందులో భాగంగా 107 పోలింగ్ స్టేషన్ అంబిటస్ స్కూల్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడే మంత్రి హరీష్ రావు సతీ సమేతంగా ఓటు వేయనున్నారు. 
పోలింగ్ కేంద్రంలో సూచనలు...
పోలింగ్ కేంద్రానికి రాగానే ఓటర్ ఎలా వ్యవహరించాలి అనే పోస్టర్‌ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం గుర్తించిన వాటిని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పోలింగ్ ఎలా జరుగుతుందో చూడటానికి వెబ్ క్యాస్టింగ్ ద్వారా రాష్ట్ర, జిల్లా ఎన్నికల కమిషన్ అధికారులు చూడనున్నారు. ఏజెంట్లు ఎవరు వస్తారనేది పార్టీలు తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. 1102 పోలింగ్ కేంద్రాలు..1612 బ్యాలెట్ యూనిట్లు ద్వారా పోలింగ్ కొనసాగించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Don't Miss