2018 తెలంగాణ ఎన్నికలు : పోలింగ్ శాతం..

09:56 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం మొదటి సారిగా జరుగుతున్న ఎన్నికలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఉదయం నుండే కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించడం...మాక్ పోలింగ్ ఆలస్యం కావడంతో ఓటర్లు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వికలాంగులు..సీనియర్ సిటిజన్స్ సైతం ఓటు వేయడానికి ఆసక్తి కననబరుస్తున్నారు. సెలబ్రెటీలు సైతం ఉదయమే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపునిస్తున్నారు. 
ఆకర్షనీయంగా పోలింగ్ కేంద్రాలు...
మరోవైపు ఓటు శాతం పెరిగేందుకు పలు కేంద్రాలను అందంగా అలకరించడం..మొదటి ఓటర్‌కు పుష్పగుచ్చాలు ఇవ్వడం..వేసిన ఓటర్లకు మొక్కలు ఇవ్వడం..పలు ప్రాంతాల్లో మహిళలకు ప్రత్యేక పోలింగ్ ఏర్పాటు చేయడం విశేషం. 
ఓటింగ్ శాతం...
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి. 2014 ఎన్నికల్లో 60 శాతం నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 శాతం నమోదు కావడం విశేషం. 
నాగార్జున సాగర్ 7.4 శాతం...నల్గొండ 9.0 శాతం...ఖమ్మం 10.0 శాతం..పాలేరు 9.0 శాతం...మధిర 9.0 శాతం...అంబర్ పేట 6.0 శాతం...ముషీరాబాద్ 6.5 శాతం...చాంద్రాయణగుట్ట 6.2 శాతం...ఆదిలాబాద్ 9.0 శాతం...కరీంనగర్ 8.0 శాతం...నిజామాబాద్ 7.5 శాతం...వరంగల్ 10.0 శాతం...మెదక్ 14.0 శాతం...రంగారెడ్డి 10.0 శాతం...హైదరాబాద్ 7.0 శాతం...నల్గొండ 8.5 శాతం...మహబూబ్ నగర్ 11.5 శాతం...ఖమ్మం 9.5 శాతం...ఆదిలాబాద్ 8.0 శాతం...గజ్వేల్ 7.0 శాతం...సిద్దిపేట 10.4 శాతం...సిరిసిల్ల 7.0 శాతం...హుజూర్ నగర్ 8.0 శాతం...కొడంగల్ 8.0 శాతం...గద్వాల 7.8 శాతం...హుస్నాబాద్ 7.0 శాతం...నాగార్జునన సాగర్ 7.4 శాతం...నమోదైంది. 

Don't Miss