వాళ్లే రెచ్చగొట్టారన్న రేవంత్...నమ్ముదామా ?

09:38 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మార్షల్ పెట్టి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నాడు జరిగిన ఘటన చెదురుముదురు ఘటనలని అభివర్ణించారు. ఈ ఘటనపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత గవర్నర్ తన విశేష అధికారాలను ఉపయోగించడం లేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదన్నారు. తక్షణమే సభలో జరిగిన పూర్తి వివరాలపై గవర్నర్ నివేదిక తెప్పించుకుని...వీడియో ఫుటేజ్ లను పరిశీలించి అనంతరం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పది గంటలకు మొదలు కావాల్సిన గవర్నర్ ప్రసంగం ఐదు నిమిషాల ఆలస్యం అయ్యిందని దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మామా..అల్లుళ్ల నాటకానికి తెరదింపాలని..ప్రజా సమస్యలపై చర్చించాలని..రైతులకు అండగా నిలబడాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

Don't Miss