'వినతిపత్రం చించేసిన హరీష్'..

17:50 - January 13, 2018

వరంగల్‌ : రూరల్‌ జిల్లా పర్వతగిరిలో మంత్రి హరీష్‌రావు పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలపై అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇస్తే... చించివేసి.. తమను తోసేశారని కాంగ్రెస్‌ పార్టీ రైతు కిసాన్‌ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి దేవేందర్‌రావు ఆరోపించారు. దీంతో అక్కడ స్వల్ప గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకుని పోలీసులు కాంగ్రెస్‌ నేతలను పక్కకు తీసుకెళ్లారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. సమస్యలపై వినతిపత్రం ఇస్తే పట్టించుకోకుండా దౌర్జన్యం ప్రదర్శించారని ఆరోపించారు. దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్దిచెబుతారన్నారు కాంగ్రెస్‌ నేతలు. 

Don't Miss