బాలికలు బడెందుకు మానేస్తున్నారు...

07:33 - March 19, 2017

ఢిల్లీ : అర్థంతరంగా బాలికలు చదువుకు ఎందుకు దూరమవుతన్నారని సెంట్రల్ అడ్వయింజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ చర్చించింది. బాలికల విద్యపైకేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ సబ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీ సభ్యులు సమావేశంలో చర్చించారు. 
సెంట్రల్ అడ్వయింజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం 
దేశస్థాయిలో బాలిలకను విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన సెంట్రల్ అడ్వయింజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఈ కమిటీకి తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వం వహిస్తున్నారు. 
బాలికల విద్య ప్రోత్సహనికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
బాలికల విద్యలోని వెనుకబాటుతనానికి కారణాలు తెలుసుకునేందుకు.. వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనుకబాటుతనానికి బాలికల సామాజిక, ఆర్థిక అంశాలు, లింగ వివక్ష వంటి అంశాలు ఎంతవరు ప్రభావితం చూపుతున్నాయో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. 
బాలికల హాజరు నమోదు, డ్రాపౌట్ శాతం పరిశీలించాలని నిర్ణయం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలో బాలికల హాజరు నమోదు, డ్రాపౌట్ శాతాలని పరిశీలించాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారికి హాజరు శాతాన్ని లెక్కించనున్నారు. అలాగే విద్యాలయాలు, పాఠశాలల్లో బాలికల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, టాయిలెట్స్ లేకపోవడం వంటి తదితర అంశాలు చర్చకు వచ్చాయి. 
ఈ నెల 31న తదుపరి సమావేశం 
బాలికల విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలువుతున్న ఉత్తమ విధానాలను స్టడీ చేసి ఓ నివేదికను రూపొందించనుంది. తదుపరి సమావేశం ఈ నెల 31వ తేదీన జరగనుంది.  

 

Don't Miss