ఏపూరి సోమన్న పట్ల పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు మండిపాటు

17:48 - September 2, 2017

సూర్యపేట : ఏపూరి సోమన్న పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సోమన్నను పోలీసులు గొలుసులతో బంధించడాన్ని టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, టీడీపీ నేత రేవంత్‌రెడ్డితో పాటు పలువురు నేతలు దారుణమని అభిప్రాయపడుతున్నారు. ఆయన కుటుంబ వ్యవహారంలో ఎమ్మెల్యే వీరేశం భార్య పుష్ప కలుగజేసుకుని... సోమన్నను దూషించడం సరికాదన్నారు. ఇదంతా పోలీస్‌స్టేషన్‌లోనే జరగడం దారుణమన్నారు. ఇక ఈ వ్యవహారంలో.... ఈరోజు సోమన్న... ఎమ్మెల్యే భార్య పుష్పపై తిరుమలగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనను దూషించిన పుష్పపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పోలీసు రాజ్యం నడిపిస్తున్న పాలకులకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయని.. ప్రతిపక్ష నేతలంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ విచారణ చేపట్టనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss