తెలంగాణ ఎన్నికలు : పోలింగ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రై

12:21 - December 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ వినూత్నమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు..ఓటర్లు సౌకర్యవంతంగా ఓట్లు వేసేందుకు ఈసీ చక్కటి ఏర్పాట్లను చేస్తోంది.  వినూత్నంగా ఆలోచించింది. ఓట్లు వేసేందుకు వచ్చే ఓటర్లు బ్రీతింగ్ ఎనరైజర్  టెస్ట్ (డ్రంక్ అండ్ డ్రై) చేయాల్సి నిర్వహించాలని నిర్ణయించింది. ఏంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లలో ఉపయోగించే బ్రీత్ ఎనరైజర్స్ ను పోలింగ్ బూత్ లలో వినియోగించటం ఏంటా అనుకుంటున్నారా? అదే తెలంగాణ ఎన్నికల కమిషన్ సరికొత్త ఐడియా.
తాగుబోతులకు ఈసీ చెక్..
పోలింగ్ జరిగే సమయంలో తాగుబోతుల హల్ చల్ చేయటం సాధారణం. తాగుబోతులకు చెక్ పెట్టేందుకు..వారిని పోలింగ్ బూత్ నుంచి దూరంగా ఉంచేందుకు బ్రీతింగ్ ఎనరైజర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఓటర్లు మద్యం తాగి ఓటు వేయకుండా చేసేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఇది. ఎన్నికల బూత్ లోను దీనికి సంబంధించిన పోలీసు అధికారులను నియమించనుంది ఈసీ. దీనికి సంబంధించి పూర్తిస్థాయి అధికారాలు లేనందున కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ఎన్కికల కమిషన్ ఈ మేరకు ఓ ప్రతిపాదన పంపించింది. దీనికి సంబంధించిన అధికారిక ఆమోదం వచ్చినట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. మద్యం తాగి ఓటు వేయటానికి వచ్చి పట్టుబడినా.. ఓటు వేసేందుకు వచ్చి ఘర్షణలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తారు. ఈ ఎన్నికల సీజన్ లో పోలీసులు ఇప్పటికే రూ. 9.62 కోట్లు విలువైన 4 కోట్ల 79వేల 868 లీటర్ల మద్యం, 94.17 కోట్ల రూపాయలు, బంగారం, వెండి, గంజ, గుట్కా, పొగాకు వంటి ఇతర పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. బాటిల్ తీసుకుని ఓటు వేస్తాం అంటే ఇక కుదరదు. కిక్కులో మీట నొక్కటం కూడా వీలుకాదు. బీ కేర్ ఫుల్ ఓటర్లు...

Don't Miss