తెలంగాణ ఎన్నికలు : 181 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు..

11:33 - December 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు పార్టీల్లోనే కాదు ప్రజల్లో కూడా వేడిపుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ఎటువంటివారు? వారిపై వున్న కేసుల వివరాలపై ఓ నివేదిక విడుదల అయ్యింది. ఆ వివరాలు చూద్దాం..
181 మందిపై క్రిమినల్ కేసులు..
తెలంగాణ శాసనసభకు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో 181 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని ‘తెలంగాణ ఎలక్షన్ వాచ్’ అనే సంస్థ ప్రకటించింది. టీఆర్‌ఎస్, మహాకూటమి, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీల తరఫున 365 మంది పోటీ చేస్తుండగా, వీరిలో 181 మంది క్రిమినల్ కేసుల్లో వున్నారని  ప్రకటించారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో సహా మొత్తం 30 స్వచ్ఛందసేవా సంస్థలు కలిసి ‘తెలంగాణ ఎలక్షన్ వాచ్’ అనే ప్రత్యేక స్వచ్ఛంద సేవా  ఓ నివేదికను విడుదల చేసింది.అనే విషయంపై తెలంగాణ ఎన్నికల కోసం అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) డిసెంబర్ 3వ తేదీన ఒక నివేదికను విడుదల చేసింది. 
పార్టీలు, అభ్యర్థులు, కేసులు వివరాలు..
టీఆర్‌ఎస్ తరఫున 119 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వీరిలో 57 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని..అలాగే మహాకూటమి తరఫున 119 మంది పోటీ చేస్తుండగా వీరిలో 77 మందిపై కేసులు నమోదై ఉన్నాయని, బీజేపీ తరఫున 119 మంది పోటీలో ఉండగా, 40 మందిపై కేసులు ఉన్నాయని, ఎంఐఎం తరఫున 8 మంది రంగంలో ఉండగా ఏడుగురిపై కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. 
కేసులున్న అభ్యర్థులు వీరే..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేసీఆర్ కొడుకైన ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్, మంత్రులు టి. హరీష్‌రావు, జోగురామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, స్పీకర్ మధుసూదనాచారితో పాటు పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. అలాగే మహాకూటమిలో భాగంగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ, వి. సునీత, జే. గీతారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, పి. సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. రేవంత్‌రెడ్డి తదితరులు కేసులు నమోదైన వారిలో ఉన్నారు. బీజేపీ తరఫున పోటీలో ఉన్న ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఎంఐఎం తరఫున పోటీలో ఉన్న అక్బరుద్ధీన్ ఒవైసీతో సహా ఏడుగురు అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు.
పార్టీలు..క్రిమినల్ అభియోగాల అభ్యర్థులు..
టిఆర్ఎస్ అభ్యర్థులలో 44 మంది, కాంగ్రెస్ నుంచి 45 మంది, బిజెపికి చెందిన 26 మంది అభ్యర్థులతో సహా ఇతర పార్టీలకు చెందిన మొత్తం 181 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయినట్లుగా ఈ సంస్థ తెలిపింది. ఏడీఆర్ నివేదిక విశ్లేషించబడిన  1,777 మంది అభ్యర్థులలో, 368 మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులను వున్నారు. వీరిలో 231 మంది అభ్యర్థులు తీవ్రంగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.
పూర్తి వివరాలు తెలపని అభ్యర్థులు..
799 మంది అభ్యర్థులు వారి విద్యా అర్హతను ప్రకటించగా.. ఐదుగురు అభ్యర్థులు మాత్రం పూర్తి వివరాలను తెలపలేదు. మిగిలినవారు గ్రాడ్యుయేట్ లేదా పైన విద్యా అర్హతను కలిగి ఉన్నారని ప్రకటించింది. 
తీవ్రమైన క్రిమినల్ కేసులు..ఆయా పార్టీల అభ్యర్థులు..
తీవ్రమైన క్రిమినల్ కేసులు అంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష వుండటం, ఉదాహరణకు దాడి, హత్య, కిడ్నాప్, కేసులు అత్యాచారం, అవినీతి నిరోధక చట్టం కింద వంటి కేసులున్నట్లుగా తెలుస్తోంది.  వారిలో ఆరు మంది అభ్యర్థులు హత్య కేసులు వుండగా..24 మందిపై హత్యాయత్నాల కేసులున్నాయి.
కేసులున్న అభ్యర్థులు వీరే..
ఎస్సీ వర్గానికి చెందిన  స్వతంత్ర అభ్యర్థి బొమతి విక్రమ్, వరంగల్ వెస్ట్, బహదూర్పురా నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన  షిక్ మొహద్ కలీముద్దీన్, టీఆర్ఎస్ కు చెందిన వేములా వీరేశం, టీడీపీకి చెందిన మహబూబ్ నగర్ స్వతంత్ర అభ్యర్థి మెరుగు శ్రీనివాస్, చంద్ర షీకర్, జంగాన్ లపై కేసులున్నట్లుగా నివేదిక లో వెల్లడయ్యింది. అలాగే టిఆర్ఎస్ నాయకుడైన తన్నేరు హరీష్ రావుపై  ఐపిసి సెక్షన్ 354 కింద కేసు వుండగా.. కాంగ్రెస్ నేత అనుముల రేవంత్ రెడ్డిపై కూడా పలు అభియోగాల కేసులున్నట్లుగా తెలుస్తోంది.  
ఇక అభ్యర్థుల ఆస్తుల వివరాలు..
టీఆర్ఎస్ అభ్యర్థి అమీర్ మెహ్మద్..
టిఆర్ఎస్ టిక్కెట్  బోధన్ నుంచి పోటీ చేస్తున్న షాకిల్ అమీర్ మొహమ్మద్ సంపద 1311 శాతం పెరిగి రూ .1,34,08,582 నుండి 18,91,55,539 కు చేరినట్లుగా నివేదికలో వెల్లడయ్యింది.
గువ్వల బాలరాజు: 
ఎస్సీ వర్గానికి చెందిన టిఆర్ఎస్ అభ్యర్థి  ఆస్తుల విలువ 1336% పెరిగి రూ .48,51,000 నుంచి రూ .6,96,74,000 కు పెరిగింది.
దాస్యం వినయ్ భాస్కర్:
టిఆర్ఎస్ అభ్యర్థి వరంగల్ వెస్ట్ నుండి పోటీ పడుతున్న దాస్యం వినయ్ భాస్కర్ ఆస్తుల విలువ  1671% పెరిగి రూ .31,69,198 నుండి 5,61,23,057 కు పెరిగింది.
రాజా సింగ్: 
గోషమహాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి  రాజాసింగ్ తన పదవీకాలంలో 3376 శాతం ఆస్తులుండగా..రూ. 9,52,738 నుంచి 3,31,17,897 కు పెరిగింది.
గాదరి కిషోర్ కుమార్: 
ఎస్సీ వర్గానికి చెందిన గాదరి కిషోర్ కుమార్ తంగతుర్తి  నుండి తెలంగాణ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ నాయకుడు కిషోర్ ఆదాయం గత నాలుగున్నర సంవత్సరాల్లో 5718 శాతం పెరిగింది. అతని ఆదాయం ప్రస్తుతం  రూ .1,82,328 నుండి 1,06,08,445 గా వున్నట్లు గా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 
 

 

Don't Miss