తెలుగు భాష...టీప్రభుత్వం కీలక నిర్ణయం

21:44 - September 12, 2017

హైదరాబాద్ : తెలుగు భాషకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో తెలుగును తప్పనిసరి చేసింది. తెలుగును తప్పనిసరిగా బోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి వరకు పాఠ్యాంశంగా తెలుగు కచ్చితంగా బోధించే పాఠశాలలు, కళాశాలలకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు అన్ని పాఠశాలల నామ ఫలకాలు కూడా తెలుగులోనే ఉండాలన్నారు. దీంతో పాటు తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహాసభల సన్నాహక కార్యక్రమాలు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

 

Don't Miss