కాకినాడ సెజ్ లో మరోసారి ఉద్రిక్తత..

14:25 - November 4, 2017

తూర్పుగోదావరి : మరోసారి సెజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను అమలు చేయాలని కోరుతున్న వారిపై మరోసారి పోలీసులు విరుచకపడ్డారు. కాకినాడ సెజ్ లో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. పలువురు రైతులు..సీపీఎం నేతలను ఈడ్చుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు.

సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలను అమలు చేయాలని కోరుతున్నామని వారు పేర్కొన్నారు. మరోవైపు జీఎంఆర్ యాజమాన్య సంస్థ పొలాల్లోకి ఎవరూ రాకుండా అడ్డుకొంటోంది. రెండు రోజులుగా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలంటూ పలువురు రహదారిపై బైఠాయించారు. దీనితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Don't Miss