ఆదివాసీలపై కేసుల్ని బేషరతుగా ఎత్తివేయాలి : తమ్మినేని

16:27 - October 13, 2017

హైదరాబాద్ : కొమ్రంభీం జిల్లా స్మారక మ్యూజియంలో గిరిజన తెగల మధ్య వచ్చిన తగాదాను సామరస్యంగా పరిష్కరించకుండా ప్రభుత్వం ఘర్షణను పెంచే విధంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆదివాసీలపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తక్షణమే ప్రభుత్వం రెండు తెగల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించి ఆదివాసీ గిరిజనుల మీద పెట్టిన కేసుల్ని బేషరతుగా ఎత్తివేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

 

Don't Miss