దేశానికి వామపక్షాలే ప్రత్యామ్నాయం..

09:49 - February 8, 2018

నల్గొండ : దేశానికి వామపక్షాలే ప్రత్యామ్నాయం.. లెఫ్ట్‌పార్టీలు బలపడితేనే దేశంఓ మతోన్మాదధోరణులకు అడ్డుకట్టపడుతుంద్నారు సీపీఎం జాతీయ నేతలు. నల్లగొండలో ముగిసిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర  ద్వితీయ మహాసభల్లో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నికయ్యారు. అలాగే 13 మందితో రాష్ట్రకార్యదర్శివర్గం, 60 మందితో రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది.  
రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక 
నల్లగొండలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర ద్వితీయమహాసభలు విజయవంతం అయ్యాయి. తమ్మినేని వీరభద్రం మరోసారి తెంగాణ సీపీఎం పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు 13 మందితో రాష్ట్ర కార్యవర్గం, అలాగే 60 మందితో రాష్ట్ర కమిటీని మహాసభల్లో  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికయిన రాష్ట్ర కార్యవర్గంలో  తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి కాగా.. కార్యవర్గ సభ్యులు 13 మందిలో ఎస్‌. వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, చుక్క రాములు, నంద్యాల నర్సింహారెడ్డి, సున్నం రాజయ్యతోపాటు  బి.వెంటకట్‌, టి.జ్యోతి,  జూలకంటి రంగారెడ్డి, పి.సుదర్శన్‌రావు, జి.రాములు, డిజి నర్సింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే  సీనియర్ నేతలు.. మల్లు స్వరాజ్యం, సారంపల్లి మల్లారెడ్డి , పి.రాజారావును పార్టీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. 
మహాసభల్లో పాల్గొన్న ఏచూరి, బీవీ. రాఘవులు 
మహాసభల్లో పాల్గొన్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివీ. రాఘవులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టారు. దేశానికి వామపక్షాలే నిజమైన ప్రత్యామ్నాయం అన్నారు. దోపిడీ, అణచివేత, ఆదిపత్యానికి వ్యతిరేకంగా పోరాడే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. రాబోయే రోజుల్లో మతోన్మాదం, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. తమ భవిష్యత్‌ ఉద్యమాలు, పోరాటాలపై సమగ్ర వ్యూహాన్ని రూపొందించుకున్నామని కొత్త ఎన్నికయిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం అంటోంది. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించేందుకు  వామపక్ష, దళిత, బహుజను సంఘాలు  ఐక్యంగా ముందు సాగుతాయని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. 

 

Don't Miss