కేజీ టూ పీజీ హామీని కేసీఆర్‌ అటకెక్కించారు: తమ్మినేని

13:29 - February 17, 2017

ఖమ్మం: కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని కేసీఆర్‌ సర్కార్‌ అటకెక్కించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పేద పిల్లలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యపట్ల కేసీఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. పేదల జీవితాలలో వెలుగొచ్చినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా తమ్మినేని ఆధ్వర్యంలో సాగుతున్న పాదయాత్ర 124వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో ప్రారంభమైన యాత్ర.. పందిళ్లపల్లి, గాంధీనగర్‌, ధంసలాపురం, అగ్రహారం, ముస్తఫానగర్‌ మీదుగా ఖమ్మం చేరుకుంటుంది. పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. పల్లెపల్లెనా పూలమాలలతో తమ్మినేని బృందానికి ఘనస్వాగతం తెలుపుతున్నారు. మహిళలు బతుకమ్మలతో ఆహ్వానం పలికారు. చిన్నారుల నృత్యాలు, మహిళల కోలాటం ఆకట్టుకుంది.

Don't Miss