'ఇండో' లో భారీ బాల భీముడు...

11:02 - June 30, 2016

ఇండోనేషియ : అతడి వయస్సు 10 ఏళ్లు ... బరువు 192 కిలోలు. నిరంతరం ఆకలితో బాధపడే ఈ బాలుడు ప్రపంచంలోనే అత్యంత బరువున్న వ్యక్తిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం లేవలేని స్థితిలో ఉన్నాడు. ఏ క్షణం ఏ మవుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇండోనేషియాకు చెందిన ఆర్య పర్మానా ఊబకాయంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

పదేళ్లకే 192 కిలోల బరువు ...
ఇండోనేషియాకు చెందిన ఆర్య పర్మానా ఊబకాయంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నిరంతరం ఆకలితో బాధపడే ఆర్య..పదేళ్లకే 192 కిలోల బరువు పెరిగాడు. ఆర్య ప్రపంచంలోనే అత్యంత బరువున్న బాలుడిగా రికార్డుల్లోకెక్కాడు. రోజువారీ ఆహారంలో కోతపెడుతున్నా.. శరీరం మాత్రం విపరీతంగా పెరగుతుండడంతో అతడి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఆవేదనల తల్లిదండ్రులు...
ఇండోనేషియా సిపువార్సి గ్రామానికి చెందిన ఈ భారీ కాయుడు సంపన్నుడేం కాదు. రైతు కుటుంబానికి చెందిన రోకయ, సోమంతిల రెండో సంతానం. నార్మల్ డెలివరీ ద్వారానే జన్మించిన ఆర్య.. పుట్టినప్పుడు 3.8 కిలోలు మాత్రమే ఉన్నాడు. కాని రెండేళ్లు పూర్తవగానే ఆర్య బరువు ఆసాధారణంగా పెరుగుతూ.. ప్రస్తుతం 192 కిలోలకు చేరుకున్నాడు. దీంతో కుటుంబం గ్రామంలోని చాలా మంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లినా.. బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని .. ప్రమాదమేమి లేదని తెలిపారట దీంతో ఈ విపరీత పరిణామం అర్థకాక తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు.

ఇద్దరు తినే ఆహారాన్ని ఒకేసారి తింటున్న ఆర్య..
ఒకసారి పెద్దవాళ్లు ఇద్దరు తినే ఆహారాన్ని.. ఆర్య ఒకేసారి తినేస్తాడు. రోజుకి ఐదుసార్లు అన్నం, బీఫ్ , చేపలు, కూరగాయలు సూప్ ఇది ఒక రోజు మెను. నిరంతరం ఆకలితో ఉండే.. తమ కుమారుడికి భోజనం పెట్టలేకపోతున్నామని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు తెచ్చి మరీ వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు.

వైద్యానికి సహకరించని ఆర్థిక స్థోమత...
ప్రస్తుతం ఖరీదైన వైద్యం చేయించాలంటే..తమ ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని.. ఏదో ఒక రోజు తమ కుమారుడు అందరిలా మామూలు పిల్లవాడిలా మారతాడనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది కుటుంబం. 

Don't Miss