నేత్రపర్వంగా తెప్పోత్సవం..

07:10 - October 1, 2017

విజయవాడ : దసరా మహోత్సవాల్లో ఆఖరి రోజు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను హంస వాహనంలో ఊరేగిస్తూ నిర్వహించిన ఈ వేడుక నేత్రపర్వంగా సాగింది. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై నుంచి ఉత్సవ మూర్తులను ఊరగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం మూడు సార్లు హంసవాహనం పై కృష్ణానదిలో తెప్పమీద ప్రదక్షిణలు చేశారు. వేలాది మంది భక్తులు దుర్గాఘాట్‌, పున్నమిఘాట్‌, ప్రకాశం బ్యారేజిపై నుండి ఈ ఉత్సవాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన లేజర్‌ షో అందరినీ ఆకట్టుకుంది. 

Don't Miss