గుండు గీయించుకున్న సోనూ నిగమ్..

16:07 - April 19, 2017

ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ స్వయంగా గుండు గీయించుకున్నాడు. ఇందుకో కారణం ఉంది. ఇటీవల ఆయన పలు వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. మసీదుల నుండి వచ్చే ప్రార్థనలు..లౌడ్ స్పీకర్ల ద్వారా వచ్చే ఉపన్యాసాలు..ప్రార్థనా పిలుపులపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన సోనూ ట్వీట్లపై కోల్ కతా ఓ మతగురువు స్పందించారు. సోనూ నిగమ్ కు గుండు కొట్టిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తానని పేర్కొంటూ ఫత్వా జారీ చేశారు. దీనితో సోనూ నిగమ్ స్పందించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు తనింట్లోనే ఉంటానని, ఎవరైనా వచ్చి గుండు చేయవచ్చని సవాల్ విసిరాడు. అనంతరం సోనూ నిగమ్ స్వయంగా గుండు గీయించుకుని మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ మతానికి..వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేయలేదని, అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని తెలిపారు. తాను ఎవరికీ భయపడనని, ఇంకా ఫత్వాలు జారీ చేయడం ఏంటీ అని సోనూ ప్రశ్నించారు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా ? ముదురుతుందా ? వేచి చూడాలి.

Don't Miss