దంపతుల ప్రాణాలు తీసిన పిడుగు...

17:17 - June 2, 2018

నల్గొండ : పిడుగుపాటులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. పిడుగులు పడుతుండడంతో ప్రాణనష్టం సంభవిస్తోంది. తాజాగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ అలగడపలో పిడుగు పడింది. గొర్రెల మేత కోసం వెళ్లిన దంపతులు ఎల్లావుల వెంకయ్య, నర్సమ్మలపై ఈ పిడుగు పడడంతో అక్కడికక్కడనే మృతి చెందారు. దంపతులిద్దరూ మృతి చెందడంతో అలగడపలో విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి దంపతుల కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Don't Miss