నగరానికి కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం..

10:15 - February 27, 2017

అమెరికా : ఉన్మాది చేతిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం ఈ రోజు హైదరాబాద్‌కు రానుంది. రాత్రి 8:45 గంటలకు శ్రీనివాస్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటుంది. బొల్లారం ఖాజీపల్లిలోని శ్రీనివాస్ స్వగృహానికి మృతదేహం తరలిస్తారు. మంగళవారం ఉదయం 11గంటలకు మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
జాతివివక్ష తలకెక్కిన తెల్లజాతీయుడు ఆడం పురింటన్‌ విచక్షణ రహిత చర్యకు.. తెలంగాణ వాసి శ్రీనివాస్‌ కూచిభొట్ల బలయ్యాడు. మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. హైదరాబాద్‌ జెఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్‌, అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. కాన్సాస్‌ రాష్ట్రంలోని ఒలాతేలో ఉన్న గార్మిన్‌ కంపెనీలో ఏవియేషన్‌ ఇంజనీర్‌గా చేరాడు.

Don't Miss