బ్రాండ్ అంబాసిడర్ గా 'రకూల్'...

12:00 - October 13, 2017

రకూల్ ప్రీత్ సింగ్..ఓ సామాజిక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూన్న ఈ ముద్దుగుమ్మ ప్రధాన మంత్రి తలపెట్టిన 'భేటీ బచావో..భేటీ పడావో' కార్యక్రమానికి తెలంగాణ తరపు నుండి కేసీఆర్ ప్రభుత్వం అంబాసిడర్ గా నియమించింది.

సామాజిక అభివృద్ధి పట్ల...స్త్రీల పురోగతి అంశంలో ఎక్కువగా 'రకూల్ ప్రీత్ సింగ్' శ్రద్ధ చూపుతుంటుంది. తెలంగాణ ప్రభుత్వం తనను ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల సంతోషంగా ఉందని 'రకూల్' పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో తాను కూడా ఒక భాగం కావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

రకూల్ ప్రీత్ సింగ్ తమిళ..కన్నడ..హిందీ..తెలుగు భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లోని యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. జయ జానకి నాయక..రారండోయ్ వేడుక చూద్దాం..విన్నర్..ధృవ..సరైనోడు..నాన్నకు ప్రేమతో...బ్రూస్ లీ..కిక్-2..పండుగ చేసుకో..రన్..కరెంటు తీగ..లౌక్యం..వెంకటాద్రి ఎక్స్ ప్రెస్..తదితర చిత్రాల్లో 'రకూల్ ప్రీత్ సింగ్' నటించింది. ఇటీవలే వచ్చిన 'స్పైడర్' సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. 'కార్తీ' సరసన 'ఖాకీ'లో..తీరన్..అదిగరం ఒంద్రు..జయత్ జంత్రి సినిమాలో 'రకూల్' నటిస్తోంది.

Don't Miss