‘మారుతీ' పని అయిపోయిందా ?

12:49 - August 29, 2017

డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన ఓ హీరో మరో మంచి స్టోరీ లైన్ తో రాబోతున్నాడు. చిన్న సినిమాలతో హిట్ కొట్టి తన నేమ్ నే ఒక బ్రాండ్ గా మార్చుకున్న డైరెక్టర్ ఈ హీరో తో జతకట్టబోతున్నాడు. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న హీరో 'శర్వానంద్'కి 'రాధ' సినిమా బ్రేక్ పడింది. సంక్రాంతి బరిలో 'శతమానం భవతి'తో భారీ హిట్ అందుకున్న 'శర్వా' తరువాత 'రాధా' సినిమాతో వచ్చాడు. కధలో కత్తదనం లేదని, 'శర్వానంద్' రెగ్యులర్ మూస సినిమాలని నెత్తిన వేసుకుని ఫ్లాప్స్ ని మూటకట్టుకుంటున్నాడని ఫిలిం నగర్ టాక్. ఇప్పటివరకు పలు విభిన్నమైన పాత్రలు పోషించాడు 'శర్వానంద్' మళ్లీ రెగ్యులర్ స్టోరీస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాడో అని ఫిలిం లవర్స్ అనుకుంటున్నారట. జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు ఇప్పుడు కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'శతమానం భవతి' సినిమాకి గాను నేషనల్ అవార్డు రావడం కూడా మంచి ఉత్సహాన్ని ఇచ్చినట్టుంది.

స్టోరీ ని నమ్ముకోకుండా కేవలం హాస్యానికే పెద్ద పీట వేసి ఫ్లాప్ సినిమాని తీసాడు అని డైరెక్టర్ 'మారుతీ' గురించి ఫిలింనగర్ అనుకుంటుంది అంట. 'బాబు బంగారం' సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేదని అనుకుంటుంటారు. తన దగ్గర ఉన్న కథలని మంచి స్క్రీన్ ప్లే తో రాసుకుని ప్రెసెంట్ చేసే డైరెక్టర్స్ లో 'మారుతీ' ఒకడు. చిన్న సినిమాతో పెద్ద హిట్ ఇవ్వడం 'మారుతీ' టాలెంట్. మరి 'మారుతీ' ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరో 'శర్వానంద్' కావడం విశేషం .

దర్శకుడు 'మారుతీ’.. ‘భలే భలే మగాడివోయ్’లో హీరోను మతిమరుపు వాడిగా చూపించి అదిరిపోయే వినోదాన్నందించాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. 'భలే భలే..’లో 'నాని' మతిమరుపు వాడైతే.. 'మారుతీ' కొత్త సినిమా ‘మహానుభావుడు’లో హీరో 'శర్వానంద్' ఓసీడీతో బాధపడే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఓసీడీ అంటే.. అతి శుభ్రతతో బాధపడే ఒక డిసార్డర్ అన్నమాట. ‘భలే భలే..’ సినిమా నిర్మాణంలో భాగస్వాములైన యువి క్రియేషన్స్ వాళ్లే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఫేమ్ మెహ్రీన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ‘మహానుభావుడు’ దసరా కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన ఫిలిం క్రిటిక్స్ మాత్రం 'భలే భలే మగాడివోయ్' సినిమాని అటు ఇటు తిప్పి పాచిపోయిన పాత చింతకాయ పచ్చడిని కొత్త ప్యాకెట్ లో పెట్టి అమ్మబోతున్నారు అని అనుకుంటున్నారంట. కొందరైతే ఏకంగా 'మారుతీ' పని అయిపోయింది అని అనుకుంటున్నారంట. 

Don't Miss