మేడారం...స్థంభించిన ట్రాఫిక్...

09:15 - January 31, 2018

వరంగల్ : మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సుమారు కొన్ని కిలోమేటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామన్న అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని తెలుస్తోంది.

బుధవారం సారలమ్మ..పగిడిద్దరాజు..గోవిందరాజు..గద్దెలపైకి తీసుకొని రానున్నారు. గురువారం సమ్మక్క - పగిడిద్దరాజు పెండ్లి వేడుక కార్యక్రమం జరుగనుంది. ఇందుకు ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వద్ద 300 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.

మంగళవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి బయల్దేరారు. ఆయన తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి మేడారం చేరుకుంటారు. సారలమ్మతో కలిసి ముగ్గురు గద్దెల మీదకు చేరుకుంటారు. శుక్రవారం సమ్మక్క, సారలమ్మతోపాటు పగిడిద్దరాజు ఆయన తమ్ముడు గోవింద రాజులు గద్దెలమీదే ఉంటారు. జాతర చివరి రోజైన శనివారం సమ్మక్క వన ప్రవేశం చేస్తుంది. ఈ జాతరలోనూ పగిడిద్ద రాజు సమ్మక్కను పెళ్లాడతారు.

Don't Miss