చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల కోసం వేట

12:38 - January 10, 2018

కర్నూలు : జిల్లాలోని చెన్నంపల్లి కోటలో 27 రోజులుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నా ఏ ఫలితం దక్కలేదు. ఇప్పుడు మళ్లీ పాతాళగంగ టార్గెట్‌గా తవ్వకాలు మొదలుపెట్టారు. పాతాళగంగను దాటి కిందకు వెళ్తే నిజంగానే గుప్తనిధులు ఉన్నాయా? గుప్తనిధిని చేరుకునే మార్గం ఇదేనా? వాచ్‌ ది స్టోరి. 
పాతాళ గంగలోపల గుప్త నిధులు 
రాతిపై మూడు తలల నాగు పాము... ముందుకెళ్తే 11 మంది దేవతామూర్తుల ప్రతిమలు.. బొమ్మలు దాటుకుని ముందుకెళ్తే పాతాళగంగ... కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోట రెండవవైపు ఉన్న ఈ పాతాళ గంగలోపల గుప్త నిధులు ఉన్నాయని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం 27 రోజులుగా  తవ్వకాలు జరిపారు. క్యావిటీ స్కానర్లు, జీపీఎస్ స్కానర్లతో భూమిలో క్యావిటీల కోసం వెతికారు. భూమి లోపలికి 30 అడుగుల లోతు వరకూ తవ్వినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు కొత్తగా కోట రెండవవైపు ఉన్న పాతాళ గంగ బావి దగ్గర తవ్వకాలు మొదలుపెట్టారు.
గుప్త నిధులు దొరుకుతాయో? 
ప్రస్తుతం పాతాళ గంగలో ఉన్న నీటిని మోటార్ ద్వారా బయటకు తోడేస్తున్నారు. ఈ బావిలో 11 మెట్లు ఉంటాయని... తరువాత సొరంగం ఉంటుందని.. ఆ సొరంగం ద్వారా ముందుకు వెళ్తే నిధిని చేరుకుంటామని స్ధానికులు నమ్ముతున్నారు. ఈ తవ్వకాల్లో అందరూ అనుకుంటున్నట్లు గుప్త నిధులు దొరుకుతాయో? ప్రభుత్వానికి ఖర్చు, శ్రమే మిగులుతుందో వేచి చూడాలి. 

 

Don't Miss