ఉత్తరాఖండ్ సీఎం గా రావత్ ప్రమాణస్వీకారం

17:48 - March 18, 2017

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్‌లోని పరేడ్‌ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కృష్ణకాంత్‌ పాల్- త్రివేంద్రసింగ్‌ రావత్‌తో ప్రమాణం చేయించారు. సిఎంతో పాటు  9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో మదన్‌ కౌషిక్‌, రేఖ ఆర్యా, సత్పాల్‌ మహరాజ్‌, ప్రకాష్‌ పంత్‌ ఉన్నారు. త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ఉత్తరాఖండ్‌కు 9వ ముఖ్యమంత్రి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోది, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ సిఎం హరీష్‌ రావత్‌ కూడా హాజరయ్యారు. 56 ఏళ్ల త్రివేంద్ర సింగ్‌ 1983 నుంచి 2002 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్తగా పనిచేశారు. 2002లో డొయివాలా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన త్రివేంద్రసింగ్‌ అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఆయన గతంలో వ్యవసాయమంత్రిగా పనిచేశారు. 

Don't Miss