ఉత్తరాఖండ్‌ సీఎంగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌

09:39 - March 18, 2017

హైదరాబాద్: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పేరును బిజెపి ఖరారు చేసింది. డెహ్రాడూన్‌లో జరిగిన బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో త్రివేంద్రసింగ్‌ రావత్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోది, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా తదితర దిగ్గజ నేతలు హాజరు కానున్నారు. 56 ఏళ్ల త్రివేంద్ర సింగ్‌ 1983 నుంచి 2002 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్తగా పనిచేశారు. 2002లో డొయివాలా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన త్రివేంద్రసింగ్‌ అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. త్రివేంద్రసింగ్‌ పిజితో పాటు జర్నలిజంలో డిప్లమా చేశారు. ఆయన భార్య సునీతా రావత్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. రావత్‌ దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు.

Don't Miss