యూఏఈ నుంచి కేరళకు భారీ ఎత్తున సామాగ్రి

18:12 - August 25, 2018

ఢిల్లీ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కేరళకు భారీ ఎత్తున సామాగ్రిని పంపనుంది. యూఏఈ ప్రభుత్వ విమాన సంస్థ ఎమిరేట్స్ విమానంలో 175 టన్నుల సహాయ సామాగ్రిని తీసుకుని   కేరళకు బయలుదేరింది. కేరళకు యూఏఈ అండగా ఉంటుందని, 175 టన్నుల సామాగ్రిని తీసుకొస్తున్నామని ఎమిరేట్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. యూఏఈలోని ఎంతోమంది వ్యాపారవేత్తలు, ప్రజలు, సంస్థలు అందించిన సాయాన్ని విమానాల ద్వారా తిరువనంతపురానికి తరలిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బోట్లు, రగ్గులు, నిల్వ ఆహార పదార్థాలు, తదితర అత్యవసర వస్తువులను తరలిస్తున్నారు. యూఏఈలో పనిచేస్తున్న విదేశీయుల్లో 80 శాతం మంది కేరళ వాసులే ఉండడంతో వరద బాధితులను ఆదుకునేందుకు ఆ దేశం ముందుకు వచ్చింది.

Don't Miss