లిక్కర్ కింగ్ కు షాక్...

09:30 - July 6, 2018

ఢిల్లీ : బ్యాకులకు కోట్లాది రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాకు యూకే హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌ లోని మాల్యా ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు వీలు కల్పించింది. 13 భారతీయ బ్యాంకులు వేసిన కేసును హైకోర్టు విచారణ జరిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, ఆయన ఏజెంట్లు హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని మాల్యా ఉంటున్న భవనాల్లోకి సోదాలు నిర్వహించడానికి అనుమతించింది. టెవిన్‌లోని లేడీవాక్, బ్రాంబిల్ లాడ్జ్‌లలో మాల్యా ఆస్తులు ఉన్నాయి. 9 వేల కోట్ల రుణాలను రికవరి చేసేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ బ్రయాన్ జూన్ 26న ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం కల్పించాలని కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లో మాల్యా పిటిషన్ దాఖలు చేశాడు.

Don't Miss