టెట్‌ పాసైన అభ్యర్ధులందరినీ టీఆర్‌టీకి అనుమతించాలి : నిరుద్యోగ జేఏసీ

19:42 - February 3, 2018

హైదరాబాద్ : టీఆర్‌టిలో టెట్‌ పాసైన అభ్యర్థులందరిని అనుమతించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎంకి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రగతి భవన్‌కి వచ్చారు. కానీ సీఎం లేకపోవడంతో వినతి పత్రాన్ని పోలీసులకు అందజేసి వెనుతిరిగారు. టీఆర్‌టి 2017 నోటిఫికేషన్ లో బీ-ఈడిలో 45శాతం.. డీ-ఈడిలో 50శాతం.. నిబంధన పెట్టడం వల్ల టెట్‌ పాసైకూడా చాలామంది విద్యార్ధులు నష్టపోతున్నారని.. వారు ఆందోళన చెందుతున్నారు. టెట్ రాసేందుకు లేని ఉత్తీర్ణత శాతాలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని వారు ప్రశ్నించారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

 

Don't Miss