స్వాతి ప్లాన్ ప్రకారమే హత్య

16:32 - December 15, 2017

నాగర్ కర్నూలు : సుధాకర్‌రెడ్డి హత్య కేసులో స్వాతి ప్రియుడు రాజేష్‌ను మరికాసేపట్లో నాగర్‌కర్నూలు మెజిస్ట్రేట్‌ ఎదుట పోలీసులు హాజరుపర్చనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు... నాగర్‌కర్నూలు తీసుకొచ్చారు. భర్త సుధాకర్‌రెడ్డి స్థానంలో ప్రియుడు రాజేష్‌ను తీసుకొచ్చేందుకు స్వాతి చేసిన కుట్ర మటన్ సూప్ కారణంగా బెడిసికొట్టింది. సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వాతి బండారం బట్టబయలైంది. ఆధార్ వేలిముద్రలతో స్వాతి ప్రియుడు దొరికిపోయాడు. సుధాకర్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని .. స్వాతికి భర్త అంటే ఇష్టం లేకపోవడంతో హత్య చేశామని రాజేష్ చెప్పాడు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు రాజేష్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆ తరువాత ముఖంపై పెట్రోలు పోసుకుని గ్యాస్ స్టౌపై తలపెట్టినట్లు రాజేష్ వివరించాడు. ఇద్దరం కలిసి బతుకుదామనే ఈ హత్య చేసి అనంతరం సుధాకర్‌రెడ్డిని నిర్మానుష్య ప్రాంతంలో కాల్చివేసినట్లు రాజేష్ పోలీసులకు చెప్పాడు. 

Don't Miss