ఉసేన్ బోల్ట్ చివరి పరుగు..

15:45 - June 12, 2017

ఉసేన్ బోల్ట్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మైదానంలో చిరుతలాంటి పరుగుతో ప్రపంచాన్ని శాంసిచే అథ్లెట్. ఇతడిని ముద్దుగా 'జమైకా చిరుత' అంటుంటారు. ఇతను తన క్రీడా జీవితానికి గుడ్ బై చెప్పేశాడు. శనివారం రాత్రి సొంత గ్రౌండ్ కింగ్స్ ట్టన్ నేషనల్ స్టేడియంలో చివరి పరుగు తీశాడు. 100 మీటర్ల పరుగులు పందెంలో బోల్ట్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కేవలం 10.03 సెకండ్లలోనే అధిగమించడం విశేషం. చివరి పరుగు చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. 30 వలే మంది ఈ పరుగును తిలకించడం గమనార్హం. పరుగు ముగిసిన వెంటనే 'బోల్ట్‌' మైదానంలోని అభిమానులకు సెల్యూట్‌ చేసి అభివాదం చేశాడు. తనను మొదట్నుంచి ఆదరిస్తూ వచ్చిన జమైకన్ల ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. 2002 అంతర్జాతీయంగా కెరీర్‌ను 'బోల్ట్' ప్రారంభించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌ల్లోను 100, 200 మీటర్లు పరుగుతో పాటు 400 మీటర్లు పరుగు పందెంల్లో వరుసగా బీజింగ్‌, లండన్‌, రియో ఒలింపిక్స్‌ల్లో తొమ్మిది స్వర్ణాలు సాధించాడు. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన 30 ఏళ్ల బోల్ట్‌ ఇక ఓ ఇంటి వాడు కావడంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టనున్నాడు.

Don't Miss