తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్‌..... ప్రచారంలో విఫలమయ్యాం : వీహెచ్‌

21:51 - February 23, 2017

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడిన తాము ప్రజలకు చెప్పుకోవడలో మాత్రం విఫలమయ్యామని కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి.హన్మంతరావు అన్నారు. సంగారెడ్డిజిల్లా పటాన్‌చెరువులో ఏర్పాటు చేసిన జన ఆవేదన సభలో ఆయన మాట్లాడారు. సొంతరాష్ట్రంలో కూడా తెలంగాణప్రజల జీవితాలు బాగుపడలేదన్న వీహెచ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు . నిరుద్యోగ నిరసన సందర్భంగా కోదండరాం ను  అరెస్ట్‌ను వీహెచ్‌ తప్పుబట్టారు. ఇంటినుంచి ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

Don't Miss