'మోక్షం' ఇచ్చే రోజు...

08:13 - January 8, 2017

హైదరాబాద్ : చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తండోపతండాలు తరలివస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీనితో ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి వారు దర్శనమిస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం విచ్చేశారు.

గుంటూరులో..
గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.

ద్వారకా తిరుమలలో..
పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఘనంగా జరుగుతోంది. ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా పోటెత్తారు. ఆదవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ సందర్భంగా ఆలయాన్ని శోభయమాననంగా అలంకరించారు.

Don't Miss