రైతన్నకు నీటి కష్టం..

10:18 - December 26, 2016

వనపర్తి : కాల్వలకు నీరొచ్చింది ఇకపై పంటల సాగుకు నీటి కొరత ఉండని భావించిన రైతన్నలకు ఆశాభంగమే ఎదురైంది. వనపర్తి జిల్లాలోని బీమా ఫేజ్-2 ద్వారా 22 రోజుల నుంచి చుక్క నీరు రావడం లేదు. దీంతో నీరులేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వనపర్తి జిల్లాలో రైతులకు నీటి కష్టాలు
వనపర్తి జిల్లాలో రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. బీమా ప్రాజెక్టు ఫేజ్-2కు నీరు రావడంతో తమ కష్టాలు తీరుతాయని ఆశించిన రైతన్నల ఆశలు అడియాసలయ్యాయి. భీమా ఫేజ్-2 కింద పంటలు వేసుకున్న రైతులు నీటి కోసం దిగాలుగా

బీమా ఫేజ్-2 కాలువ ద్వారా 49 వేల ఎకరాలకు నీరు
కృష్ణసముద్రం బీమా ఫేజ్-2 కింద 92 కి.మీటర్లు పారుతుంది. ఈ కాలువ ద్వారా 49 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. ప్రస్తుతం బీమా ఫేజ్-2 కాలువ కింద 14 వేల ఎకరాల్లో రైతులు వెరుశెనగ, మినుములు, కూరగాయలు లాంటి పంటలు సాగుచేస్తున్నారు. అయితే గత 22 రోజులుగా ఒక చుక్క నీరుకూడా రాకపోవడంతో బీమా ఫేజ్-2 కాలువ వట్టిపొయింది.

కాలువకు నీరు విడుదల చేయాలని రైతుల డిమాండ్
బీమా ఫేజ్ -2 కింద సాగు చేసిన ఆరుతడి పంటలకు నీరు అందక పంటలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పంటల సాగుకోసం తెచ్చిన అప్పులు కట్టడం కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు వేసిన పంటలు మరో మూడు, నాలుగు తడులు నీరందితేనే పంటలు చేతికందే పరిస్ధితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బీమాఫేస్-2 కు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

Don't Miss