ఘాజీ దర్శకుడితో వ్యోమగామిగా వరుణ్..

16:33 - June 4, 2018

'ఘాజీ' సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయి సంచలనం సృష్టించింది. 'ఘాజీ' సినిమాను మొదటి షార్ట్ ఫిలింగ్ తీద్దామనుకున్న యువకుడు సంకల్ప రెడ్డి వెండితెరకు దర్శకుడుగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో టెక్నికల్ గా వుండే విశ్లేషణ అతని దర్శకత్వ ప్రతిభకు ఓ మచ్చు తునకలా కనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఊపిరి తీసుకోనివ్వకుండా ఆద్యంత ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు సంకల్ప రెడ్డి. ఇప్పుడు తాజాగా ఈ యువ దర్శకత్వంలో వరుణ్ తేజ్ మరో టెక్నికల్ మూవీ రాబోతోంది.

వరణ్ తో జత కట్టనున్న అదితీరావు హైదరీ..
అందంతో పాటు నటన కూడా తన స్వంతం అనిపించుకున్న నటి అదితీరావు హైదరీ..ఈమె బాలివుడ్ నటి పేరు తెచ్చుకున్నా..అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి. గద్వాల్ సంస్థానాదీశుల వారసురాలు అదితీరావు హైదరీ..నానమ్మ, అమ్మమ్మ కుటంబీకులిద్దరు రాజవంశీకులే కావటం మరో విశేషం. బాహ్య సౌందర్యం కంటే అత:సౌందర్యమే మనిషికి ముఖ్య అంటున్న అదితీరావు వరుణ్ తేజ్ సరన నటించనుంది. సమ్మోహనంతో తెలుగు తెరకు పరిచయమైన అదితీ రెండో సినిమాతో వరుణ్ సరన నటించనుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ అందాల రాక్షసితో విమర్శకులు ప్రసంశలు అందుకున్న లావణ్యా త్రిపాఠి.

ఘాజీ’తో దర్శకుడిగా పరిచయమైన సంకల్పరెడ్డి..
‘ఘాజీ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు సంకల్ప్‌రెడ్డి. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠీ కథా నాయికలు. రాజీవ్‌ రెడ్డి నిర్మాత. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథ ఇది. వరుణ్‌ వ్యోమగామిగా కనిపించనున్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్‌ తీర్చిదిద్దారు. అంతరిక్షాన్ని పోలిన ఈ సెట్‌లో యాక్షన్‌ దృశ్యాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశంలో పాల్గొంటున్న వరుణ్‌, అదితిరావు తదితరులకు త్రీడీ స్కానింగ్‌ చేయిస్తున్నారు. 

పరిశీలనలో వున్న ‘వ్యోమగామి’, ‘అంతరిక్షం’పేర్లు..
నిర్మాత రాజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ సన్నివేశాల్ని రూపొందించాలనుకుంటున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ టెక్నీషియన్లు అందుబాటులో ఉండరు. ఈ సెట్‌ కూడా ఉండదు. అప్పుడు ప్యాచ్‌వర్క్‌ ఏమైనా మిగిలిపోతే... త్రీడీ స్కానింగ్‌ ఉపయోగపడుతుంద’’న్నారు. ఈ చిత్రం కోసం ‘వ్యోమగామి’, ‘అంతరిక్షం’ అనే పేర్లు పరిశీలిస్తున్నారు.

Don't Miss