నంద్యాల ఉపఎన్నిక చంద్రబాబు పాలనకు రెఫరెండం : వాసిరెడ్డి పద్మ

19:22 - August 13, 2017

 హైదరాబాద్ : టీడీపీకి  ధైర్యం ఉంటే నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు మూడేళ్ల పాలనకు రెఫరెండంగా పరిగణించాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. ఉప ఎన్నిక లేకపోతే నంద్యాలకు ఇన్ని వరాలు ప్రకటించేవారా ? అని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పశ్నించారు. నంద్యాలకు వేల కోట్ల రూపాయల వరాలు ప్రకటించారని.. ఉప ఎన్నిక లేకపోతే ఇన్ని వరాలు ప్రకటించే వారా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు ఎందుకు వరాలు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఇతర ఎమ్మెల్యేలు ఏం తప్పుచేశారని వరాలు ఇవ్వలేదని నిలదీశారు. 

 

Don't Miss