వేంపల్లి పంచాయితీ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా

19:00 - January 5, 2018

కడప : జిల్లాలోని వేంపల్లి మండలంలో పంచాయితీ కాంట్రాక్టర్‌ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఆరునెలలుగా వేతనాలు చెల్లించడం లేదని 70 మంది కార్మికులు వేంపల్లి పంచాయితీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులపై వేంపల్లి సర్పంచ్‌ విష్టువర్దన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ ఈవో నాగభూషణం రెడ్డి కలగజేసుకొని కార్మికులతో మాట్లాడి నాలుగు నెలల వేతనానికి సంబంధించి చెక్కును కార్మికులకు అందజేశారు. త్వరలోనే వేతనాలు అందేలా చేస్తామని హామీ ఇవ్వడంతో సిబ్బంది ఆందోళనను విరమించారు. 

 

Don't Miss