వెంకయ్యకు అభినందనల వెల్లువ..

09:14 - August 11, 2017

ఢిల్లీ : వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పీఠం కూర్చొబోతున్నారు. కాసేపట్లో 15వ ఉప రాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

ప్రముఖులకు వెంకయ్య నివాళులు..
ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్ ఘాట్ కు చేరుకుని మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. దీన్ దయాళ్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి, సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వెంకయ్య నాయుడుని పలువురు కలిసి అభినందనలు తెలియచేశారు.

హమీద్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు..
రాజ్యాంగబద్ధమని భావించే ఈ పదవుల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం గల వ్యక్తులు నియామకం కావడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి పదవికి నేటితో గుడ్ బై చెప్పబోతున్న హమీద్ అన్సారీ చివరి ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భార‌త్‌లో ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయని, దేశ పౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయమ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల బీజేపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. ఉప రాష్ట్ర‌ప‌తి హోదాలో ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సబబు కాదని పేర్కొంటున్నారు. 

Don't Miss