హిందీలో వెంకయ్య ప్రమాణం..

10:31 - August 11, 2017

ఢిల్లీ : దేశంలో రెండో అత్యున్నత పదవి ఏది ? ఉప రాష్ట్రపతి..ఈ పదవిపై వెంకయ్య నాయుడు ఆసీనులయ్యారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హిందీలో వెంకయ్య ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ కురువృద్ధుడు అద్వాణీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల అధినేతలు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్లమెంట్ హాల్ కు చేరుకున్నారు. అక్కడ పలువురు సభ్యులు వెంకయ్య నాయుడుకు అభినందనలు తెలియచేశారు. 11గంటలకు ఉభయ సభలు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం రాజ్యసభలో అధికారికంగా వెంకయ్య నాయుడు కూర్చొబోతున్నారు.

మరోవైపు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పదవుల్లో ఆర్ఎస్ఎస్ వ్యక్తులు నియమితులు కావడంపై చర్చ జరుగుతోంది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై వీరు ఎలాంటి వైఖరి కనబరుస్తారనేది చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీలకి అనుకూలంగా తాము ఉండమని వారు పేర్కొన్నారు. రానున్న రోజులు కీలకంగా మారనున్నాయి. పలు కీలక బిల్లుల ఆమోదం కోసం వెంకయ్య నాయుడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. 

Don't Miss