వెంకటేశ్, దుల్కర్ మధ్య 'వార్'..!

17:27 - September 4, 2018

హైదరాబాద్ : మలయాళ సూపర్ స్టార్ ముమ్ముటి కుమారుడు దుల్కర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినిమా అభిమానులకు పరిచయమైన దుల్కర్ 'మహానటి' సినిమాతో డైరెక్ట్ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యాడు. జెమినీ గణేషన్ పాత్రలో ఒదిగిపోయిన దుల్కర్ ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. వెంకటేశ్‌, దుల్కర్ సల్మాన్‌ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ పరిశ్రమ సమాచారం. వార్‌ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మరో కథానాయకుడిగా సందడి చేయనున్నారని సమాచారం. ఈ మేరకు దర్శక, నిర్మాతలు ఇద్దరినీ కలిసి స్క్రిప్ట్‌ నరేట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని చెబుతున్నారు.

Don't Miss