వెంకీతో ప్రియదర్శన్...

11:06 - May 17, 2017

విక్టరీ వెంకటేష్...భిన్నమైన పాత్రలు చేస్తూ అభిమానుల అలరిస్తున్నాడు. ఇతర భాషల్లో మంచి పేరొందిన చిత్రాల రీమెక్ ల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన నటించిన 'గురు' సినిమా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఏ సినిమాకు 'వెంకటేష్' సైన్ చేయలేదని తెలుస్తోంది. తాజాగా వెంకటేష్ - ప్రియదర్శన్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. మలయాళం..బాలీవుడ్ సినిమాల దర్శకుడైన ప్రియదర్శన్ చాలా విరామం తరువాత తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేస్తారని, జాలీ ఎల్ ఎల్ బీ -2 సినిమాలో వెంకీ నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ చిత్రాలపై మాత్రం స్పష్టత రాలేదు. వెంకటేష్‌తో దర్శకుడు ప్రియదర్శన్‌ చర్చలు జరుపుతున్నట్లు, ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్టోరీ లైన్‌ వెంకీకి చెబితే గ్రీన్‌సిగల్‌ ఇచ్చాడని టాలీవుడ్ టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Don't Miss