సంతోషం..బాధగా ఉంది - సీఎం రమేష్..

12:11 - August 11, 2017

ఢిల్లీ : ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు కావడం సంతోషంగా ఉందని..మరోవైపు కొద్దిగా బాధగా ఉందని టిడిపి ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్య నాయుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ గా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ ప్రసంగించారు. ఉప రాష్ట్రపతి పదవిలో వెంకయ్య కూర్చొవడం తెలుగు..దేశ ప్రజలు సంతోషించదగిందన్నారు. చిన్న సమస్య వచ్చినా వెంటనే వెంకయ్య కనబడే వారని, ఈ అవకాశం కోల్పోతుందనే బాధ ఉందన్నారు. దేశ అభివృద్ధి..ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి తోడ్పాటు అందిస్తానని వెంకయ్య అనడం సంతోషమన్నారు.

నెల్లూరు జిల్లాలో కాలేజీలో చదివే సమయంలో చిన్న తప్పు జరిగితే వెంకయ్య విద్యార్థి నాయకుడిగా నిలదీసే వారని, ఉదయగిరి నుండి మంచి మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఒక్కరే గెలిచారన్నారు. ఏపీ అసెంబ్లీలో వెంకయ్య ప్రసంగానికి సంబంధించిన వార్తలు..పేపర్లలో ఆనాడు తాము చూసేవారమని, అలాంటి ప్రసంగాలు ఇప్పుడు చూడలేమన్నారు. ఒక సామాన్యమైన కుటుంబం నుండి వెంకయ్య నాయుడు వచ్చేవారని, నాలుగు సార్లు రాజ్యసభలో ఉన్నారంటే మాములు విషయం కాదన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss