'మేడారానికి దేశ వ్యాప్త గుర్తింపు రావాలి'

11:55 - February 2, 2018

వరంగల్ : మేడారం జాతర దేశ వ్యాప్తంగా గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మేడారంలోని సమ్మక్క..సారలమ్మను దర్శించుకున్నారు. ఆయన వెంట డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, ఇతరులున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. గతంలో తాను సాధారణ పౌరుడిగా ఇక్కడకు వచ్చి వన దేవతలను దర్శించుకోవడం జరిగిందని..అప్పటికీ..ఇప్పటికీ ఎంతో మార్పు జరిగిందన్నారు. జాతరకు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు బాగున్నాయన్నారు. మేడారం జాతరకు రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడకు రావడం వల్ల దేశం యొక్క దృష్టి పడుతందని తెలిపారు. ఆదివాసీ, గిరిజన కుంభమేళాగా పేర్కొన్నవచ్చునని, తమ సంప్రదాయ దుస్తులతో జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. జాతర..పండుగలు..అన్నా సంతోషాలు అందరితో పంచుకోవడం..పూర్వీకులను గుర్తు పెట్టుకోవడం జరుగుతుందన్నారు. వనదేవతలు చూపించిన మార్గంలో నడవాల్సి ఉందని వెంకయ్య పేర్కొన్నారు. 

Don't Miss