'తుమ్హారీ సులు' రీమేక్ లో'చంద్రముఖి'..

11:24 - June 7, 2018

అందం అభినయం కలగలిసిన నటి జ్యోతిక.పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతిక 'చంద్రముఖి' పాత్రలో ఆమె అభినయాన్ని మరచిపోలేరు. దక్షిణభారతానికి చెందిన నటి జ్యోతిక తమిళ,కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న జ్యోతిక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె తెలుగులో నటించిన షాక్, ఠాగూర్ సినమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. డబ్బింగ్ సినిమానే అయినా..చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళి చేసుకొని కొంతకాలం నటనకు దూరంగా ఉన్న జ్యోతిక ఆ మధ్య "36 వయదినిలే"తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ, జ్యోతిక నటించిన తాజా చిత్రం 'నాచ్చియార్' టీజర్ లో జ్యోతిక ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు తమిళనాడును షేక్ చేసింది. ఇప్పుడు తాజాగా జ్యోతిక నాయికగా ఓ చిత్రం రూపొందుతోంది. హిందీలో విద్యాబాలన్ నటించిన 'తుమ్హారీ సులు' చిత్రం తమిళ రీమేక్ లో జ్యోతిక నటిస్తోంది. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నయ్ లో జరుగుతోంది. దీనిని తెలుగులోకి కూడా అనువదించనున్నారట. కాగా చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత వుందనీ..హీరోయిన్ ఓరియంటెండ్ సినిమాలు విడుదల కావటం..అవి విజయవంతం కావటం చాలా కష్టమని బహిరింగంగా చెప్పిన నటి జ్యోతిక. మహిళా సాధికారిత వుండాలని..మహిళలను తమ ప్రతిభను ఏమాత్రం మరగుపరుకోవాల్సిన పనిలేదని చెప్పే జ్యోతిక ఆత్మవిశ్వాసాన్ని సదా నిలబెట్టుకుంటున్న సందర్భాలు కూడా వున్నాయి. 

Don't Miss