'బిచ్చగాడు' ఫేం తెలుగు సినిమా..

11:19 - December 28, 2016

'బిచ్చగాడు' ఫేం 'విజయ్ ఆంటోనీ' తెలుగు సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ తంబీ లేటేస్ట్ మూవీ 'బేతాళుడు' కూడా మంచి కలెక్షన్లే సాధించడంతో తెలుగు నిర్మాతలు అతడితో సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఆంటోనీ ఓ తెలుగు మూవీని స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించేశాడు 'విజయ్ ఆంటోనీ'. అంతకుముందు 'నకిలీ', 'సలీమ్' లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ పలకరించినా ఈయన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 'బిచ్చగాడు' సంచలన విజయంతో మాత్రం తెలుగులో 'విజయ్ ఆంటోనీ' మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు మూవీ ఏకంగా 20కోట్లు వసూలు చేయడంతో 'విజయ్' అతడి సినిమాలకు తెలుగులో కూడా క్రేజ్ వచ్చేసింది. అందుకే ఆయన రీసెంట్ మూవీ 'భేతాళుడు' డబ్బింగ్ హక్కులను మన నిర్మాతలు 3కోట్ల పెట్టి మరీ తీసుకున్నారు.

రాడాన్ పిక్చర్స్..
దీంతో ఏకంగా ఈ హీరో తెలుగులో కూడా ట్రై చేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చేశాడట. సినిమా 'భేతాళుడు' ఇక్కడ పెద్దగా ఆడలేదు. అయితే 'బిచ్చగాడు' సినిమా వల్ల ఈ మూవీ ఒపెనింగ్స్ బాగానే వచ్చాయి. దీనికి తోడు శాటిలైట్ రేట్ కూడా బాగానే పలుకడంతో అక్కడిక్కడికి సరిపోయాయి. ఇప్పుడు ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ హీరో తమిళంతో పాటు తెలుగులో ఓ మూవీని ఏకకాలంలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు వినికిడి. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. రాధికా, శరత్ కుమార్ రాడాన్ పిక్చర్స్ బేనర్ మీద 'విజయ్ ఆంటోనీ' హీరోగా తెలుగు అండ్ తమిళ్ మూవీని ప్లాన్ చేస్తున్నారట. ఇంకా దర్శకుడు ఖరారు కానీ మూవీలో 'విజయ్ ఆంటోనీ'ని సంగీత లైకా ప్రొడక్షన్స్ వారు కూడా పార్టనర్ గా చేరినట్లు సమాచారం. దర్శకుడు ఫిక్స్ కాగానే ఈ సినిమాను జనవరి లేదా ఫిబ్రవరిలో తమిళ, తెలుగు భాషల్లో స్టార్ట్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారట. మొత్తానికి 'విజయ్ఆంటోనీ' సూర్య, విక్రమ్, విశాల్ రేంజ్ లో ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది.

Don't Miss