హుషారుగా విజయ్ దేవరకొండ...

10:31 - September 26, 2018

వైరైటీ స్టైల్‌తో దూసుకపోతున్న నటుల్లో ఒకరు విజయ్ దేవరకొండ. ఇతని చిత్రాలు విజయవంతం కావడంతో పలువురు దర్శకులు ఇతనితో సినిమాలు చేయాలని తహతహలాడుతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘నోటా’ విడుదలకు సిద్ధమౌతోంది. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవలే మృతి చెందిన ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు విజయ్ దేవరకొండతో జత కడుతోందని వార్తలు వెలువడుతున్నాయి. 
అలనాటి అందాలతార శ్రీదేవి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈమె కూతుళ్లను వెండితెరకు పరిచయం చేయాలని శ్రీదేవి భావించింది. 'ధడక్‌' చిత్రంతో బాలీవుడ్‌లోకి జాన్వి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నిర్మాణమయ్యే చిత్రంలో జాన్వీ నటించబోతున్నట్లు టాక్. కానీ దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం జాన్వి 'తఖ్త్‌' అనే చారిత్రక చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్‌, విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

Don't Miss