15 వరకూ చంద్రన్న కానుకలు : పరిటాల

16:04 - January 10, 2017

అనంతపురం : ఈ నెల 12వ తేదీ వరకు చంద్రన్న సంక్రాంతి కానుకలనను పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అవసరమైతే పదిహేనో తేదీ వరకు కూడా సంక్రాంతి కానుకలు అందిస్తామన్నారు. అనంతపురంలో చంద్రన్న కానుకలను ఆమె అందించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఏడాది 8 లక్షల 59వేల రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు ఆమె చెప్పారు. వచ్చే నెల నుంచి విలేజ్ మాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

Don't Miss