నడింపల్లి గ్రామాన్ని పంచాయితీగా చేయాలని గ్రామస్థుల ఆందోళన

19:50 - April 16, 2018

నిర్మల్‌ : ఖానాపూర్‌ మండలంలోని నడింపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నిర్మల్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ఖానాపూర్‌ ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైన ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే కోర్టు ద్వారానైనా గ్రామ పంచాయితీని సాధించుకుంటామని గ్రామస్థులు స్పష్టం చేశారు. చిన్న చిన్న తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామాన్ని చిన్న చూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Don't Miss