గుప్తనిధుల తవ్వకాలు... చెన్నంపల్లి కోటకు ముప్పు

12:53 - January 9, 2018

కర్నూలు : జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటకు ముప్పు వాటిల్లుతోందని పురావస్తు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 28రోజులుగా తవ్వకాలు సాగుతున్నా గుప్తనిధుల ఆనవాళ్లు కూడా లభించలేదు. అయినా కోటమొత్తాన్ని అధికారులు జల్లెడ పడుతున్నారు. మొదటి పదిరోజుల తవ్వకాల్లో ఎముకలు మాత్రమే బయడగా రెండో విడతలో కోట బురుజును తవ్విపోశారు. అయినా ఎలాంటి నిధులు కనిపించలేదు. కాగా ఇవాళ్టి నుంచి మూడో విడత తవ్వకాలు మొదలు పెట్టారు. పాతాళగంగలో వాటర్‌ప్రూఫ్‌ కెమెరాలతో నిధి అన్వేషణ కొనసాగుతోంది. అయితే ప్రణాళికలేని తవ్వకాలతో  చెన్నంపల్లి కోట రూపు రేఖలు కోల్పోతోందని స్థానికులు అంటున్నారు.  

 

Don't Miss