నిజాం కాలం నాటి భూములు పంచాలంటూ గ్రామస్థుల ఆందోళన

19:03 - April 16, 2018

పెద్దపల్లి : శ్రీరాంపూర్‌ మండలం కునారంలో నిజాం కాలం నాటి భూములను కబ్జా కోరల్లో నుంచి కాపాడి పేదలకు పంచాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రెండు వేల ఎకరాల భూమిని రాజకీయ నాయకులు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కబ్జాకు గురైన భూమి నిరుపేదలకు చెందుతుందని.. గ్రామస్థులు పారా, గొడ్డళ్లు చేత పట్టి భూములను చదును చేసి ఆక్రమించుకునే కార్యక్రమం చేపట్టారు.

Don't Miss