పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశ పెట్టాలి : ఐద్వా

18:45 - August 13, 2017

అనంతపురం : వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఏపీ ఐద్వా కార్యదర్శి రమాదేవి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా బార్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులను రద్దు చేయాలని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ఛలో వెలగపూడి కార్యక్రమాన్ని చేపడతామని రమాదేవి హెచ్చరించారు.

 

Don't Miss