సైనికులకు సరైన తిండి దొరకని దుస్థితి...

09:28 - January 10, 2017

జమ్మూకాశ్మీర్‌ : ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు పని చేస్తున్నారు. వీరోచితంగా పోరాడి.. తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి.. శత్రువుల బారి నుంచి దేశాన్ని కాపాడుతున్నారు. దేశ రక్షణ కోసం సరిద్దుల్లో పోరాడుతున్న సైనికులకు నాణ్యమైన ఆహారం దొరకండం లేదు. దేశంలోని రాజకీయనేతలు, అవినీతి పరులు, బడా వ్యాపారవేత్తలు మాత్రం నాణ్యమైన, పౌష్టికాహారం లభిస్తుంది. కానీ దేశాన్ని కాపాడుతున్న సైనికులకు మాత్రం తిండి కరువైంది. వారికి నాణ్యమైన భోజనాన్ని అందించడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశాన్ని రక్షించే బృహత్తరమైన కార్యాన్ని సైనికులపై పెట్టిన కేంద్రం.. వారికి నాణ్యమైన, సరిపడ తిండి పెట్టడంపై  దృష్టి పెట్టడం లేదు. సైనికులపై పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. దేశ రక్షణలో అత్యంత కీలకమైన సైన్యానికి ప్రతి ఏడాది అధిక నిధులు కేటాయిస్తున్నా.. సరిహద్దుల్లో సైనికులకు మాత్రం సరైన తిండి దొరకడం లేదు. కంటిమీద కునుకు లేకుండా కాపాలా కాస్తున్న జవాన్లకు మంచి భోజనం పెట్టడం లేదు. జమ్మూకాశ్మీర్‌ సరిహద్దు భద్రతాదళంలోని 29వ బెటాలియన్‌కు చెందిన తేజ్‌ బహదూర్‌యాదవ్‌ అనే సైనికుడు నాణ్యత లేని ఆహారాన్ని షూట్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దేశంలో అవినీతి పెరిగిపోవడం వల్లే.. తమకు సరైన ఆహారం దొరకడం లేదంటున్నాడు. పసుపు నీళ్లు, ఉప్పు తప్ప మరేమీ ఉండని పప్పు తిని 11 గంటలు నిలబడి ఎలా డ్యూటీ చేస్తామని ప్రశ్నిస్తున్నాడు. దీనిపై కేంద్రం స్పందించే వరకు ఇలాగే వీడియోలు పోస్ట్‌ చేస్తానన్నాడు తేజ్‌ బహదూర్‌. అయితే.. దీనిపై స్పందించిన బీఎస్‌ఎఫ్‌ విచారణకు ఆదేశించింది. 

Don't Miss